Note: All the charcaters are fictious..Please cut down the wings of u r imaginations...ofcourse just for the below lines:)
మౌనమేల నీకు ఓ జవరాల!
నా హ్రుదయ రోదన నీవు వినలేదా??
జాబు రాసి, వేచి చూసా నీ జాడ కోసం
చెంత చేరి ఓదార్చె ఒక తోడు కోసం
చూసి చూసి కంటి పాప అలసిపోయె
ఏడ్చి ఏడ్చి కన్నీరె కరిగిపోయె
తాను అలసినా, అశ్రువింకినా రెప్పమూయనంటుంధి నా నా నయనం
నీ రాక తెలియదేమోననే పిచ్చి భయం !
నువ్వే నా ప్రాణమన్నావు, నీ తోడిదే నీ తోడిదే నా లోకమన్నావు
ఊసులెన్నొ ఆడావు, బాసలెన్నొ చెసావు
ఆ ఊసులే ఉలులై నా మది తొలచినా, బాసలే బాధలై ఎద బరువెక్కినా
మౌనమే నీ మాటన్నావు, ప్రాణం ఉన్న శిలవయ్యావు!!
ప్రియురాలు కఠినమన్న మనసు కవి మాట వినిఆనాడు నవ్వుకున్నా,
ఆ మహాకవికే మనసు లేదనుకున్నా !
గుండెకు గాయం చేసి నవ్వుతున్న నిన్ను చూస్తున్నా
ఆ మాటే నిజమని నేడు నేను నమ్ముతున్నా...
అయినా.........
అనుక్షణం నీ తలపే అంటుంది ఈ హ్రుదయం
మరణం దరి చేరువరకు చేస్తానంతుంది నీ నిరీక్షణం!!!
Saturday, September 13, 2008
Boulevard of Broken hearts
Posted by CnU at 12:36 AM
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
Superb........I think you should take serious step in poetry!!!!
-swapna
Post a Comment